"మహానటి" ని తప్పుపట్టిన జెమిని కుమార్తె..!!

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 11:07 AM


హైదరాబాద్, మే 17 : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన "మహానటి" చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. సావిత్రి జీవితానికి సంబంధించిన విషయాలను అద్బుతంగా తీర్చిదిద్దారంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కీర్తి.. అచ్చం సావిత్రిలా ఒదిగిపోయింద౦టూ సినీ ప్రముఖులు కితాబిచ్చారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొత్త వివాదం ఒకటి తెర మీదకు వచ్చింది. తన తండ్రిని చిత్రీకరించిన పద్దతిపై జెమినీ గణేశన్ కుమార్తె కమలా సెల్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఒక తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మహానటి' మూవీని ఆమె తప్పు పట్టారు. తమిళ౦లో ఎంజీఆర్.. శివాజీ గణేశన్ లతో పాటు తన తండ్రి జెమినీ గణేశన్ కూడా అగ్రహీరో అని.. ఆ విషయం అందరికి తెలుసన్నారు. ఈ సినిమాలో తన తండ్రి పాత్రను సోమరిపోతుగా.. చిన్న పనులు చేసే వ్యక్తిగా చిత్రీకరించి కించపరిచారంటూ ఆరోపించారు. సావిత్రికి తన తండ్రే మద్యం అలవాటు చేశాడని చూపించడం సరైనది కాదన్నారు.

సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నటులంతా ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదన్నట్లు చూపించారని అవన్నీ అవాస్తవాలన్నారు. అలాగ్ సావిత్రి "ప్రాప్తం" సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆమెకు కలిసి తన తండ్రి ఆమె నిర్ణయం మార్చుకోవాలని చెప్పేటప్పుడు సావిత్రి వాచ్ మెన్ తో మమ్మల్ని బయటకు గెంటేసి౦దని.. అప్పుడు తన తండ్రితో తానూ కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక అప్పటి నుండి తన తండ్రైన జెమిని గణేషన్ ఆ ఇంటి ముఖం చూడలేదన్నారు.

Untitled Document
Advertisements