ఆది సినిమాకు నానితో టైటిల్..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 05:55 PM

ఆది సినిమాకు నానితో టైటిల్..

హైదరాబాద్, మే 21 : కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై నేచురల్ స్టార్ నాని నటించిన "నిన్ను కోరి" చిత్ర౦ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడదే బ్యానర్ పై ఎమ్ వీవీ సినిమాస్ వారితో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించనుండగా.. తాప్సి .. రితికా సింగ్ కథానాయికలుగా కనిపించనున్నారు.

ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే హీరో నానితో ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడి౦చనున్నారు. ఆది పినిశెట్టి తొలుత హీరోగా చేసి ఆ తర్వాత వరుసగా ప్రతి నాయకుడి పాత్రలను పోషిస్తూ వచ్చాడు. మరలా ఈ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు దర్శనమివ్వనున్నాడు.Untitled Document
Advertisements