శ్రీరెడ్డి వ్యాఖ్యలు.. రంగంలోకి 'అభిమన్యుడు'..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 04:45 PM

శ్రీరెడ్డి వ్యాఖ్యలు.. రంగంలోకి 'అభిమన్యుడు'..

హైదరాబాద్, జూలై 16 : టాలీవుడ్ లో 'కాస్టింగ్ కౌచ్' ఉందంటూ దానికి వ్యతిరేకంగా ఓ ఉద్యమమే చేసింది శ్రీరెడ్డి. ఆ మధ్య ఆమె ఏమి చేసిన మీడియా మిత్రులు తెగ హడావిడి చేసేశారు. అక్కడి వరకు బాగానే ఉన్న ఒక స్టార్ పవర్ దెబ్బకు శ్రీరెడ్డి పోరాటం ఏటో వెళ్లిపోయింది. ఇక అక్కడి నుండి ఈ అమ్మడు వార్తల్లో వెతికిన దొరకలేదు. కాగా అప్పుడప్పుడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తుంది. అమెరికా సెక్స్ రాకెట్ లీక్స్ అంటూ సోషల్ మీడియాలో సంచలనమే సృష్టించింది.

అంతేకాదు టాలీవుడ్ లోని ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తూ వారిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది. టాలీవుడ్ లో తనను ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ లోని వ్యక్తులను టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ మధ్యకాలంలో మురుగదాస్, లారెన్స్, శ్రీరామ్(శ్రీకాంత్)పై ఆమె ఆరోపణలు చేయడమే కాకుండా.. హీరో విశాల్ వైపు నుంచి తనకు బెదిరింపులు ఉంటాయేమోననే అనుమానాలను శ్రీరెడ్డి వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు కోలీవుడ్ అంతా ఈ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు.

ఈ విషయంపై టి.రాజేందర్ స్పందిస్తూ.. శ్రీరెడ్డి ఎవరిపై ఆరోపణలు చేసిందో.. వాళ్లు స్పందించాలనడంతో విషయం మరింత వేడెక్కింది. ఈ విషయంపై స్పందించిన విశాల్.. ఇక శ్రీరెడ్డి ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. ఎవరిపై అయితే శ్రీరెడ్డి ఆరోపణలు చేసిందో.. వాళ్లతో మాట్లాడిన తరువాత ప్రెస్ మీట్ పెట్టాలని విశాల్ భావిస్తున్నాడట. మరి ఈ విషయానికి.. ఆయన ఎలా ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.





Untitled Document
Advertisements