ఉత్తరప్రదేశ్‌ లో భారీ వర్షాలు : 33 మంది మృతి

     Written by : smtv Desk | Sat, Jul 28, 2018, 12:34 PM

ఉత్తరప్రదేశ్‌ లో భారీ వర్షాలు : 33 మంది మృతి

దిల్లీ: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా 33మంది ఆగ్రాలో ఎక్కువ మంది మృతిచెందారు. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాల కారణంగా ట్రాఫిక్‌, విద్యుత్‌ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. వరదల పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు యూపీలోని పలు ప్రాంతాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
యూపీ సహా దేశ రాజధాని దిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.





Untitled Document
Advertisements