రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారు.

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 06:18 PM

రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారు.

* కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమంగా కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. మానసికంగా దెబ్బతీయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డిని అక్రమంగా ఇరికించారని రేవంత్ రెడ్డి అన్నారు. . ఈ సందర్బంగా అయన సీఎల్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ..మనుషుల అక్రమ రవాణా కేసులో నిందితుడు రషీద్ అలీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌‌రావులను విచారించాలని డిమాండ్ చేశారు.

2007మే 22న నిందితుడు మహమ్మద్‌ రషీద్‌ అలీ సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో కేసీఆర్, హరీశ్‌ ‌రావు పేర్లు కూడా ఉన్నాయని ఆరోపించారు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడ జగ్గారెడ్డి పేరు లేదన్నారు. అయినా మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు.

ప్రభుత్వ అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండకూడని అన్నారు. చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో శాంతిభద్రతలను గవర్నర్‌ పర్యవేక్షించాల్సి ఉందన్నారు. తక్షణమే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. తనకు నోటిసు ఇచ్చిన అంశంపై పూర్తి వివరాలతో త్వరలో స్పందిస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు.

Untitled Document
Advertisements