ఆకట్టుకుంటున్న 'మజిలీ' టీజర్

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 11:25 AM

ఆకట్టుకుంటున్న 'మజిలీ' టీజర్

హైదరాబాద్, ఫిబ్రవరి 14: సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత మొదటిసారిగా 'మజిలీ' సినిమాలో తెరపై జంటగా కనిపించనున్నారు. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందించబడింది. సమంతతో పాటు దివ్యాన్శక్ మరో కథానాయికగా ఈ సినిమాలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో నాగ చైతన్య క్రికెట్ ఆడే యువకుడి గానూ, తర్వాత పెళ్ళైన వ్యక్తి గానూ కనిపించాడు. రియల్ లైఫ్ లో ఎంతో ప్రేమగా ఉండే సమంత, నాగ చైతన్య ఈ సినిమాలో మాత్రం ప్రేమ లేని భార్య భర్తలుగా కనిపించారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. గోపి సుందర్ అందించిన నేపధ్య సంగీతం టీజర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.





Untitled Document
Advertisements