టీజర్ లో ఒక ఫైట్.. ఓ లిప్ లాక్ ..దేవరకొండ మార్క్..

     Written by : smtv Desk | Sun, Mar 17, 2019, 02:56 PM

 టీజర్ లో ఒక ఫైట్.. ఓ లిప్ లాక్ ..దేవరకొండ మార్క్..

యువ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. కాకినాడ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నాడు. నిమిషం టీజర్ లో ఒక ఫైట్.. ఓ లిప్ లాక్ చూపించాడు దర్శకుడు భరత్ కమ్మ.



అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జంటగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో ఈ ఇద్దరు జంట స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మే నెలలో రిలీజ్ అవుతుంది. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements