మీడియాకు హరీష్‌రావు వార్నింగ్....రేపు నాకు క్షమాపణలు చెప్పాలి అంటూ హెచ్చరికలు!

     Written by : smtv Desk | Mon, Apr 01, 2019, 06:13 PM

మీడియాకు హరీష్‌రావు వార్నింగ్....రేపు నాకు క్షమాపణలు చెప్పాలి అంటూ హెచ్చరికలు!

హైదరాబాద్‌ : మాజీ మంత్రి, టిఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు పార్టీ మారబోతున్నానంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. అంతేకాక వార్త చివరన ఏప్రిల్ 1 తేదీ సందర్భంగా ఏప్రిల్ ఫూల్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ అవడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వార్తా హరీష్‌రావు వరకూ వెళ్ళింది. దీనిపై స్పందించిన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా సదరు పత్రిక తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రము మీడియా సంస్థ నాపై ప్రచురించిన వార్త.. ఫేక్ న్యూస్‌కు గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే యావత్ భారతదేశం మొత్తం ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇలాంటి తరుణంలో తప్పుడు వార్తలను, ప్రసారం చేయడం పద్ధతి కాదు. ఇటువంటి చిల్లర వార్తలను ఇంకెప్పుడూ ప్రచురించొద్దని మీడియా సంస్థలను కోరుతున్నారు. ఇదే సమయంలో.. తనపై తప్పుడు వార్తను ప్రచురించిన పేజీలోనే రేపు(మంగళవారం) క్షమాపణలు చెబుతూ మరో వార్తను ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నాను అని హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా సదరు మీడియా సంస్థను హెచ్చరించారు.





Untitled Document
Advertisements