ఎన్నికల ప్రచారానికి సిద్దమైన చిరంజీవి

     Written by : smtv Desk | Wed, Apr 03, 2019, 12:15 PM

 ఎన్నికల ప్రచారానికి సిద్దమైన చిరంజీవి

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మెగాస్టార్ చిరంజీవి.. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చిరు.. ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయారు. ఆయన తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నర్సింహా‌రెడ్డి‌’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే కొద్దిరోజుల్లో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరుపున చిరంజీవి ప్రచారం చేయనున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో కొండాతో కలిసి చిరు ప్రచారం చేయనున్నారు. అలాగే ఈ నెల 8వ తేదీన చేవెళ్లలో జరగబోయే బహిరంగ సభలో సోనియా గాంధీ, చిరు పాల్గొననున్నట్లు సమాచారం. కొండా విశ్వేశ్వర్‌తో చిరు కుటుంబానికి బంధుత్వ ఉంది. అందుకే ఆయన విశ్వేశ్వర్ తరుపు ప్రచారం చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements