ధావన్ ఎమోషనల్ వీడియో

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 12:43 PM

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్, బొటనవేలి ఎముక విరిగిన కారణంగా వరల్డ్ కప్ క్రికెట్ కు దూరంకాగా, అతను పెట్టిన ఓ వీడ్కోలు పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తీవ్రమైన భావోద్వేగంతో ఉన్న ధావన్, ట్విట్టర్ వేదికగా, తన అభిమానులతో మాట్లాడాడు. టోర్నీ నుంచి తను వెళ్లిపోతున్నానని చెప్పాడు. ప్రపంచకప్‌ లో ఆడటం లేదని చెప్పేందుకు తానెంతో బాధ పడుతున్నానని అన్నాడు. ఇప్పట్లో తాను ఆడటం సాధ్యం కాదని వైద్యులు స్పష్టం చేశారని చెప్పాడు.కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్లి, కప్ ను సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నాడు. తాను గాయపడినప్పుడు మద్దతుగా నిలిచిన తోటి ఆటగాళ్లకు, ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ జరిగేలోగా తన గాయం మానబోదని చెప్పడం వల్లే తాను తిరిగి ఇండియాకు బయలుదేరినట్టు ధావన్ వ్యాఖ్యానించాడు. కాగా, ధావన్ స్థానంలో జట్టులోకి రిషబ్ పంత్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ధావన్ వీడ్కోలు వీడియో వైరల్ కావడంతో, చూసిన క్రికెట్ అభిమానులు అయ్యో పాపం అంటూ, ధావన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా కమిన్స్ బౌలింగ్‌లో శిఖర్ ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది.రెండు వారాల్లో అతను కోలుకుంటాడని మొదట భావించినప్పటికీ గాయం తీవ్రత కారణంగా అతను ఇప్పట్లో కోలుకోలేడని బీసీసీఐ నిర్దారించింది. దీంతో ధావన్‌ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.ధావన్ స్థానంలో రిషబ్ పంత్ ఇప్పటికే టీమ్‌తో చేరిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements