తమన్నా కోసం తాప్సీ!!

     Written by : smtv Desk | Fri, Jul 19, 2019, 11:09 AM

తమన్నా కోసం తాప్సీ!!

హీరోయిన్స్ ఒకప్పుడు అసూయతో ఉండేవారు అంటారు. కానీ ఇప్పుడు సిట్యువేషన్ వేరేగా ఉంది. వాళ్ల మధ్య హెల్థీ రిలేషన్ షిప్ ఉంటోంది. తమకు వచ్చిన ఆఫర్ ని సైతం వేరే హీరోయిన్ కు రికమెండ్ చేస్తున్నారు. రీసెంట్ గా అలాంటి సంఘటనే జరిగింది. తాప్సీ తెలుగులో నటించి హిట్టైన ఆనందో బ్రహ్మ తమిళ రీమేక్ కు తమన్నాను ఆమె రికమెండ్ చేసింది. దాంతో తమన్నా చాలా సంతోషపడి తాప్సీ తన బెస్ట్ ప్రెండ్ అని చెప్తోందిట.

తాను చేయనని చెప్పిన తర్వాత ఎవరితో అయినా నిర్మాతలు చేస్తారు. అయితే తమన్నా అయితే పూర్తిగా న్యాయం చేస్తుందని తన దగ్గరకు వచ్చిన నిర్మాతలను ఒప్పించటం గొప్ప విషయమే కదా అంటోంది. ఇప్పుడు హిందీ వెర్షన్ ని సైతం రిలీజ్ చేయబోతున్నారట.

చిన్న చిత్రంగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఆనందోబ్రహ్మ. దీనికి దర్శకుడు మహి వీ.రాఘవ్‌. ఆనందోబ్రహ్మ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్‌ పూర్తైంది. ఆగస్టు లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలుగులో నటి తాప్సీ నటించిన పాత్రను తమన్నా పోషించింది. ఇది హర్రర్‌ కథా చిత్రమే కావడం విశేషం. ఖామోష్, అభినేత్రి తో ఫామ్ లో ఉన్న తమన్నా ఇప్పుడు తమిళ ప్రేక్షకులకి ఆనందో బ్రహ్మ రుచి చూపించనుంది! తాప్సి మెరిసిన పాత్ర లో తమన్నా ఏ మేరకు మెరుస్తుందో చూడాలని ఎదురుచూస్తున్నారు ఆమె అభిమానులు.

Untitled Document
Advertisements