రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. డబ్బులు ఇస్తా .. వీడియో డిలీట్ చెయ్

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 06:12 PM

సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్ బయటకి వచ్చింది. నిజానికి ఆ రోడ్డు యాక్సిడెంట్ స్పాట్ కాబట్టి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యిందని, సీటు బెల్టు పెట్టుకోవడం వలన బతికి బయట పడ్డానని రాజ్ తరుణ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే అదంతా అబద్దం అని అతను తాగి బండి నడుపుతూ గుద్దేసాడని కార్తిక్ అనే స్థానికుడు ఆరోపించారు. ఆరోపించడమే కాక వీడియో సాక్ష్యాలను కూడా బయట పెట్టాడు. ఈ నెల 20వ తేదీన సినీ నటుడు రాజ్ తరుణ్ కారు అలకాపురి సమీపంలో ప్రమాదానికి గురైంది. కారు ప్రమాదం గురైన తర్వాత రాజ్ తరుణ్ పరుగెత్తుకొంటూ వెళుతున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సమయంలో పక్కనే ఉన్న ఇంటిలో నివాసం ఉండే కార్తీక్ ప్రమాదం జరిగిన వెంటనే దృశ్యాలను రికార్డు చేశాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో చూద్దామనే ఉద్దేశంతో వెంబడించి మరీ రాజ్ తరుణ్ ను పట్టుకున్నాడు. అయితే మద్యం మత్తులో ఉన్న రాజ్ తరుణ్ భయపడడంతో తానే రాజ్ తరుణ్ ను ఇంటి వద్ద దింపినట్టుగా కార్తీక్ చెబుతున్నారు. ఆ సమయంలోనే ఫోన్ నెంబర్ తీసుకుని తాను ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనకు ఫోన్ చేస్తే ప్రమాదం గురించి అడిగానని ఆయన గుర్తు పేర్కొన్నారు. అయితే జరిగిన తర్వాత సంఘటన స్థలంలో తాను తీసిన వీడియోను డిలీట్ చేయాలని రాజ్ తరుణ్ తనను కోరినట్టుగా కార్తీక్ తెలిపారు. మరునాడు తనకు తన మేనేజర్ రాజా రవీంద్ర ఫోన్ చేస్తాడని రాజ్ తరుణ్ చెప్పారని... రాజ్ తరుణ్ చెప్పినట్టుగానే రాజా రవీంద్ర తనకు ఫోన్ చేశారని కార్తీక్ తెలిపారు. ఈ వీడియోలను డిలీట్ చేస్తే తననకు డబ్బులు ఇస్తారని చెప్పారని ఆయన తెలిపారు. అయితే రాజ్ తరుణ్ నిజ స్వరూపాన్ని బయటపెట్టేందుకే తాను ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదని డబ్బు ఇస్తుంటే దానిని వీడియో తీసి మరీ బయట పెడదామని అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఒక తెలుగు టీవీ చానెల్ ,ముందుకు వచ్చి ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు.





Untitled Document
Advertisements