16 సిక్సర్లు..సరికొత్త రికార్డు

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 11:35 AM

దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతున్న మూడో టెస్టులో ఓపెనెర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సొంతం చేసుకున్నాడు. రాంచీ వేదికగా సాగుతున్న సిరీస్ చివరిదైన మూడో టెస్టు తొలిరోజున రోహిత్ అద్భుత సెంచరీ నమోదు చేసి 117(164 బంతులు, 14 ఫోర్లు,4 సిక్సర్లు) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. రోహిత్ ఈ సిరీస్ లో ఇప్పటివరకు 16 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్ మన్ షిమ్రోన్ హెట్మెయిర్ (15 సిక్సర్లు) పేరిట ఉండేది. హెట్మెయిర్ 2018-19 కాలంలో బంగ్లాదేశ్ తో ఆడిన టెస్టు సిరీస్ లో ఈ రికార్డును నమోదు చేశాడు. రోహిత్ ఈ సెంచరీతో ఒక టెస్టు సిరీస్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్ మెన్ జాబితాలో రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత సిరీస్ లో రోహిత్ మూడు సెంచరీలు చేశాడు. సునీల్ గవాస్కర్ ఓపెనర్ గా 1970-71 సిరీస్ లో నాలుగు సెంచరీలు, 78-79 విండీస్ తో సిరీస్ లో నాలుగు, 1977-78లో ఆసీస్ తో సిరీస్ లో 3 సెంచరీలు చేశారు. కాగా, టెస్టుల్లో రోహిత్ కిది ఆరో సెంచరీ.





Untitled Document
Advertisements