నేడు బ్యాంకులు సమ్మె!

     Written by : smtv Desk | Tue, Oct 22, 2019, 05:58 AM

నేడు బ్యాంకులు సమ్మె!

నేడు(అక్టోబర్22)న బ్యాంకులు సమ్మె చేపట్టనున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకుల విలీనాన్ని నిరోధించడం, బ్యాంకర్ల భద్రతను బలోపేతం చేయడం, అన్ని బ్యాంకుల్లో సరైన నియామకాలు వంటి డిమాండ్లతో సమ్మె చేపడుతున్నారు. సమ్మెకు ముందే ఉద్యోగుల సంస్థలను వర్గాలుగా విభజించారు. సమ్మె రోజున ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు తెరిచే ఉంటాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఇఎఫ్‌ఐ)లు నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంకుల విలీనాన్ని నివారించడానికి, బ్యాంకు కార్మికుల భద్రతను బలోపేతం చేయడానికి, అన్ని బ్యాంకుల్లో సరైన నియామకాలకు మరోసారి బ్యాంక్ ఉద్యోగుల సంస్థలు సమ్మె చేస్తున్నాయి. అయితే ఈ వారం పండుగ కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంకులను మూసివేయడం వల్ల ఎటిఎంలు ప్రభావితం కానున్నాయి.





Untitled Document
Advertisements