వూహాన్ నుంచి ఢిల్లీకి చేరిన 76 మంది భారతీయులు...

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 02:55 PM

వూహాన్ నుంచి ఢిల్లీకి చేరిన 76 మంది భారతీయులు...

చైనాలోని వూహాన్ లో చిక్కుకుపోయిన 76 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. భారతీయులతో పాటు ఏడు దేశాలకు చెందిన మరో 36 మంది ప్రయాణికులను తీసుకుని ఎయిర్ ఫోర్స్ విమానం.. తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండైంది. ప్రయాణికుల తరలింపులో చైనా అధికారులు సహకరించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అటు జపాన్ డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకుపోయిన 119 మంది భారతీయులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. జపాన్ తీరంలో ఉన్న షిప్ నుంచి భారతీయును ముందు టోక్సో తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమనాంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. భారత ప్రయాణికులతో పాటు శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా, పెరూ దేశాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను ఢిల్లీకి తీసుకువచ్చింది ప్రత్యేక విమానం. చైనా , జపాన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు మానేసర్ లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత సొంత గ్రామాలకు పంపించనున్నారు. మరోవైపు చైనాలో కోవిడ్ తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కేసుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. అయితే దక్షిణ కొరియాలో మాత్రం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 334 కేసులు నమోదయ్యాయి. దీంతో కొరియాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 15 వందల 95కు పెరిగింది. ఇక ఇరాన్ లో 39 మంది చికిత్స తర్వాత కోవిడ్ వైరస్ నుంచి బయటపడ్డారు.

Untitled Document
Advertisements