నిత్యావసర సరుకులు ఎంతవరకు సరిపోతాయి.?

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 04:39 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకులు ఎంతవరకు సరిపోతాయి. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లకు సరకు రవాణా కష్టంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల డిమాండ్ తగినట్టుగా అందుబాటులో సరుకులు ఉన్నట్టుగా కనిపించడం లేదు. గోడౌన్‌లో సరుకుల రవాణా, ప్యాకేజింగ్ సిబ్బంది కొరత కూడా కనిపిస్తోంది. తద్వారా సరుకుల నిల్వలు సైతం ఖాళీగా కనిపిస్తున్నాయి. నగరంలో సూపర్ మార్కెట్లలో ఖాళీ ర్యాంకులు దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రతి ఇంట్లో అల్ఫాహారానికి వినియోగించే సరుకుల్లో ఉప్మా, ఇడ్లీ రవ్వ, టీ, కాఫీ పొడి, కారం, చక్కెర, పసుపు, నూనెలు, గోధుమ పిండి, డిటర్జెంట్లు, హ్యాండ్ వాష్ లు, న్యాప్కిన్స్, డైపర్ల సరఫరా కొరత ఏర్పడింది. దాంతో సరఫరా కూడా భారీగా తగ్గిపోయింది.

లాక్ డౌన్ విధించడంతో భారీ అవసరాలకు మించి అంతా కొనుగోలు చేసేశారు. వారానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసేవారంతా ముందుగానే నిత్యావసర సరుకులన్నీ కొనేసి ఇంట్లో నిల్వ పెట్టుకున్నారు. రాష్ట్రానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్‌ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్‌ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలు దిగుమతి అవుతుంటాయి. ఇవి రావాల్సిన మార్గాల్లో సరుకుల వాహనాలకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్దే చిక్కులు ఎదురువుతున్న పరిస్థితి నెలకొంది.





Untitled Document
Advertisements