తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 03:25 PM

తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎంసెట్‌ సహా అన్నీ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది.
కరోనా విజృంభిన్తున్న వేళ పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తన వైఖరిని కోర్టుకు విన్నవించింది.

దీంతో రేపటి నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, పీజీ ఈసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర పరీక్షలన్నీ వాయిదా పడనున్నాయి.

ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్క్‌ల ఆధారంగా అందరినీ పాస్ చేసింది. ఫలితాలకు సంబంధించి గ్రేడ్లను కూడా ఇప్పటికే ప్రకటించింది. తాజాగా అన్ని ప్రవేశ పరీక్షలను సైతం వాయిదావేసింది.





Untitled Document
Advertisements