ఎస్‌బీఐ నుండి కొత్త యాప్ ' యోనో'

     Written by : smtv Desk | Sat, Nov 25, 2017, 11:38 AM

ఎస్‌బీఐ నుండి కొత్త యాప్ ' యోనో'

న్యూఢిల్లీ, నవంబర్ 25 : భారతీయ ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ‘యోనో’ (యూ ఓన్లీ నీడ్‌ వన్‌)ను పేరిట ఒక యాప్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆవిష్కరించారు. డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలన్నీ నిర్వహించుకునే విధంగా ఈ యాప్ ను రూపొందించారు.ఈ యాప్‌ ద్వారా 14 కేటగిరీల్లో ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, క్యాబ్‌ బుకింగ్స్‌ నుంచి మెడికల్‌ చెల్లింపుల వరకు యోనో ద్వారా చెల్లింపులు చేయవచ్చని బ్యాంకు పేర్కొంది. ఎస్‌బీఐతో పాటు అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ లైఫ్‌, ఎస్‌బీఐ జనరల్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ఫండ్‌, ఎస్‌బీఐ క్యాప్స్‌, ఎస్‌బీఐ కార్డ్స్‌ సేవలన్నీ ఈ యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు ఎస్‌బీఐ ఆధికారులు తెలిపారు.

Untitled Document
Advertisements