వాహన కొనుగోలుదారులకు ఊరట...ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధనలు

     Written by : smtv Desk | Sat, Aug 01, 2020, 05:42 PM

వాహన కొనుగోలుదారులకు ఊరట...ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధనలు

కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? లేదంటే కొత్త బైక్ ఇంటికి పట్టుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఇవి రెండూ కాకపోతే కొత్త స్కూటర్ కొనాలని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. వాహన ధరలు ఈరోజు నుంచి దిగిరానున్నాయి. దీంతో ఇకపై కొత్త వెహికల్ కొనే వారికి ఊరట కలుగనుంది.

ఇన్సూరెన్స్ కంపెనీలు ఆగస్ట్ 1 నుంచి లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ను ఉపసంహరించుకోనున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంతే ఇకపై 3, 5 ఏళ్లకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవలసిన అవసరం లేదు.


ఈ నేపథ్యంలో కొత్తగా కారు లేదా టూవీరల్ కొనుగోలు చేసే వారికి తొలి ఏడాది ఇన్సూరెన్స్ భారం తగ్గుతుంది. దీంతో మొత్తంగా వెహికల్ ఆన్‌రోడ్ ధర కూడా దిగివస్తుంది. దీంతో ఆగస్ట్ 1 నుంచి కొత్తగా టూవీలర్ లేదా కారు కొంటే మాత్రం కొంత మేర డబ్బులు ఆదా చేసుకోవచ్చు.


ప్రస్తుతం ఫోర్ వీలర్లకు 3 ఏళ్లు, టూవీలర్లకు 5 ఏళ్లు లాంగ్ టర్మ్ కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వాహనదారులు అన్ని సంవత్సరాల ప్రీమియం మొత్తాన్ని ముందుగానే చెల్లించాల్సి వస్తుంది. దీంతో వెహికిల్ ఆన్ రోడ్ ప్రైస్ భారీగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు దీర్ఘకాల పాలసీలు కొనుగోలు చేయాల్సిన పనిలేదు.వాహన కొనుగోలుదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1 నుంచి టూవీలర్ లేదా ఫోర్ వీలర్ కొనే వాహనదారులు మూడేళ్లు లేదా ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యువల్ చేసుకుంటూ రావాలి.

Untitled Document
Advertisements