వన్ ప్లస్ 8 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్

     Written by : smtv Desk | Sun, Sep 20, 2020, 03:57 PM

వన్ ప్లస్ 8 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్

వన్ ప్లస్ 8టీ మనదేశంలో అక్టోబర్ 14వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఈ నెల చివర్లో కానీ, అక్టోబర్ ప్రారంభంలో కానీ లాంచ్ అవుతుందని అంచనా వేసినప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దీని లాంచ్ అక్టోబర్ కు వాయిదా పడింది. వన్ ప్లస్ 8 కంటే దీని కెమెరా సెటప్ విభిన్నంగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865+ ప్రాసెసర్‌ను అందించనున్నారని, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ ఫోన్ అక్టోబర్ 14వ తేదీన లాంచ్ కానుందని ముందుగా అంచనా వేశారు. అయితే ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారి కారణంగా ముందుగా ఊహించలేని పరిస్థితులు నెలకొని ఉండటం కారణంగా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారు. అయితే దీని గురించి వన్ ప్లస్ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగినా వర్చువల్ గానే జరగనుంది.

వన్ ప్లస్ 8టీ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో అనేక సార్లు లీకయ్యాయి. దీని ప్రకారం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11పై ఇది పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865+ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్.. రెండు వేరియంట్లు ఉండనున్నాయి.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉండే అవకాశం ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 16 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగా పిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ సెన్సార్ ఉండవచ్చు. ముందువైపు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించే అవకాశం ఉంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఇది 65W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

ఇందులో కెమెరా డిజైన్‌ను మారుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. వెనకవైపు ఎప్పటిలాగా మధ్యలో కాకుండా ఎడమవైపు పైభాగంలో ఈసారి వన్ ప్లస్ కెమెరాలను అందించనున్నట్లు సమాచారం.





Untitled Document
Advertisements