శీతాకాలంలో మేని నిగారింపు కొరకు ఇలా చేయండి..

     Written by : smtv Desk | Tue, Nov 02, 2021, 03:16 PM

శీతాకాలంలో మేని నిగారింపు కొరకు ఇలా చేయండి..

శీతాకాలం చలి గాలులకు చర్మం పొడిబారినట్లు తయారవుతుంది ఈ కాలంలో చర్మం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సోప్, ఇతర కాస్మోటిక్స్ వాడకాన్ని తగ్గించాలి. ముఖాన్ని పాలమీగడతో శుభ్రం చేసుకోవాలి. పాల మీగడకి నిమ్మరసం, పసుపు కలిపితే మరీ మంచిది.
రాత్రి పడుకునే ముందు గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్, రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయం ముందుగా గోరు వెచ్చని నీటితో కడుక్కుని తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుని మెత్తని టవల్తో అద్దుకోవాలి. శరీరాన్ని ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుని పది నిమిషాలు ఆగి స్నానం చేయాలి.
పాదాల పగుళ్లు ఈ కాలంలో ఎదురయ్యే మరో సమస్య మనం చేసే సమయంలో ప్యూమన్ రాయితో పాదాలను రుద్దుకోవాలి. స్నానం చేశాక ఆ పాదాలను ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి. అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు కాళ్ళకి చక్కగా కొబ్బరి నూనె గాని, వాజిలెన్ పెట్రోలియం జెల్లీ గాని రాసి చక్కగా సాక్స్ వేసుకొని పడుకోవాలి.
గులాబీ రేకులను మెత్తగా నూరి పాలలో కలిపి ఆ పేస్ట్ ని రాత్రి పడుకునే ముందు పెదవులకు రాసుకుంటే చలిగాలులకు పెదవులు పగలకుండా మృదువుగా ఉంటాయి.
ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే శీతా కాలంలో మేని నిగారింపు తగ్గకుండా ఉంటుంది.





Untitled Document
Advertisements