ఈ సినిమా చూస్తే ఉపాసనకి నిద్ర పట్టలేదు: రామ్ చరణ్

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 11:25 AM

ఈ సినిమా చూస్తే ఉపాసనకి నిద్ర పట్టలేదు: రామ్ చరణ్

హైదరాబాద్, ఫిబ్రవరి 2: మెగా హీరో రామ్ చరణ్, సతిమణి ఉపాసనకి ఏ సినిమా చూస్తే నిద్ర పట్టలేదు..? అనుకుంటున్నారా.. అదేనండి స్వీటీ అనుష్క నటించిన 'భాగమతి' చిత్రాన్ని ఈ జంట కలిసి చూశారట. ఈ విషయాన్నీ స్వయంగా చరణ్ తన ఫేస్ బుక్ వేదికగా.. 'నిన్న రాత్రి నేను, ఉపాసన కలిసి 'భాగమతి' సినిమా చూశాం. మైండ్‌ బ్లోయింగ్‌. చిత్రంలోని ప్రతి ఒక్కరూ చాలా బాగా పనిచేశారు. కంగ్రాట్స్‌. 'భాగమతి' చూసి మా ఆవిడకు రాత్రంతా నిద్రపట్టలేదు' అని పోస్ట్ చేశారు. అశోక్ దర్శకత్వంలో అనుష్క నటించిన 'భాగమతి' చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ళు రాబడుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ 'రంగస్థలం' చిత్రంలో నటిస్తున్నారు.

Untitled Document
Advertisements