మీ పిల్లలు రాత్రుళ్ళు పక్క తడిపుతున్నారా? నల్లనువ్వులతో ఇలా చేయండి

     Written by : smtv Desk | Fri, Feb 10, 2023, 04:43 PM

మీ పిల్లలు రాత్రుళ్ళు పక్క తడిపుతున్నారా? నల్లనువ్వులతో ఇలా చేయండి

చిన్న పిల్లలు నిద్దట్లో పక్క తడపడం అనేది సర్వ సాధారణమైన విషయం. అయితే కొంతమంది పిల్లలు పెరిగి పెద్దవుతున్నా కూడా వారిలో ఈ పక్కతడపడం అనే అలవాటు పోదు. అటువంటి సందర్భాలలో తలిదండ్రులు తెగ ఆందోళన చెందుతుంటారు. నిజానికి ఈ పక్క తడిపే అలవాటు వాళ్ళంతవాళ్ళే తెలుసుకొని మానుకోవాల్సిన అలవాటు. మెలకువ రాకపోవడమే దీనికి ముఖ్య కారణం. అయితే పిల్లలు రాత్రుళ్ళు పక్క తడపకుండా ఉండాలి అంటే ఈ పద్దతులు పాటించండి..

* రాత్రిపూట నీరు పెద్దగా తాగించకండి.
* పడుకోబోయే ముందు తప్పకుండా టాయిలెట్కు వెళ్ళిరమ్మని వత్తిడి చేయండి.
* పిల్లలు నిద్రమత్తులో ఒక పట్టాన మనసూచనని లెక్కచేయరు. కానీ, విసుక్కోకుండా ఓపిగ్గా వాళ్ళను నిద్రలేపి బాత్రూంలోకి తీసుకువెళ్ళండి.
* రాత్రిపూట పిల్లలు పడుకోబోయే ముందు నల్లనువ్వులు (పొట్టు తీయనివి) తీసుకొని, బెల్లం కలిపి చిమ్మిరివుండలు కట్టి 1-2 వుండల్ని పిల్లలకు పెట్టండి. పిల్లలు ఇష్టపడి తింటారు. వాళ్ళుపక్కతడిపే అలవాటులోంచి బయటపడతారు.





Untitled Document
Advertisements