లివర్ పనీతీరు మెరుగ్గా ఉండాలంటే ఈ పండు తినండి

     Written by : smtv Desk | Mon, Feb 13, 2023, 04:50 PM

లివర్ పనీతీరు మెరుగ్గా ఉండాలంటే ఈ పండు తినండి

నేరేడు పళ్ళు చూడడానికి నల్లగా, నిగనిగలాడుతూ ఉంటాయి. ఇవి రుచిలో కూడా మిగితా పళ్ళతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. కొంచం తీపి, కొంచం వగరు, కొంచం పులుపు ఇలా అనేక రకాలైన రుచులతో ఉంటుంది. అయితే ఈ పండు మన శరీర ఆరోగ్యానికి ఒక దివ్యమైన ఔషధం వంటిది. అనారోగ్యాల నివారిణి.
* ఈ పండుకు శరీరానికి శక్తినిచ్చి, కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం.
* పండు, ఆకులు, బెరుడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోలియం వంటివి నేరేడులో పుష్కలంగా ఉన్నాయి.
* జిగట విరేచనాలతో బాధపడేవారికి నేరేడు పండు రసాన్ని 2-3 చెంచాల చొప్పున ఇస్తే శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
* కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధం.
* నేరేడు పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పని చేస్తాయి. జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంతో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది.
* మూత్రంలో వచ్చే మంట తగ్గటానికి నిమ్మరసం మరియు నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్ళల్లో కలిపి తీసుకుంటే మంట పూర్తిగా తగ్గిపోతుంది.
* మధుమేహ రోగులు నేరేడు పండును రోజుకు 6-7 దాకా తింటే మధుమేహం కంట్రోలులో ఉంటుంది.
* నేరేడు ఆకులతో చేసే కషాయం బాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
* నేరేడు ఆకుల్ని దంచి కషాయంగా కాచి, పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ళ వాపు, పుళ్ళు వంటివి త్వరగా తగ్గుతాయి.
* నేరేడు ఆకులు నమిలి నీళ్ళతో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.
నేరేడు పండు సిజన్లలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఈ పండ్ల యొక్క గింజలను సేకరించి వాటి ఎండబెట్టి పొడిగా చేసుకుని ఆ పొడిని నీటిలో కలిపి తీసుకుంటే పైన చెప్పిన సమస్యలకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.





Untitled Document
Advertisements