ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరట్లేదా? ఇలా చేయండి

     Written by : smtv Desk | Thu, Feb 16, 2023, 03:49 PM

ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరట్లేదా? ఇలా చేయండి

వచ్చేది ఎండాకాలం ఈ కాలంలో ఎన్ని నీళ్ళు తాగినా కూడా దాహం తీరదు వాతావరణంలోని ఉష్నోగ్రతల కారణంగా నోరు ఎండిపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే ఎన్ని రకాల పానీయాలు తీసుకున్న అతి దాహంగా అనిపిస్తుంటే ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.
* కొన్ని చలువ మిరియాలు నోటిలో వేసుకొని చప్పరిస్తుంటే సమస్య తగ్గిపోతుంది.
* ధనియాలు కషాయముగా కాచి 20 నుండి 30 మిల్లీ లీటర్ల కషాయములో తగినంత పటికబెల్లం కలుపుకొని తాగితే దాహంగా అనిపించదు.
* ద్రాక్ష, మంచి గంధము, దానిమ్మ గింజలు సమభాగములుగా కలిపి దంచి పూటకు 1 తులం చొప్పున మంచి నీటిలో కలుపుకొని రోజుకు 3 పూటలా తాగితే సమస్య తగ్గుతుంది.
* వేప చిగుళ్ళు 3, కలకండ చూర్ణం 1/2 తులం (6 గ్రా॥లు) మిరియాలు 7, ఈమూడింటిని కలిపి నూరి, మంచినీళ్ళలో కలిపి త్రాగుతుంటే అతి దాహము శాంతిచును.
* నీళ్ళ నుండి అప్పటి కప్పుడు తెచ్చిన నాచును, కడుపుమీద పెట్టిఉంచిన అతి దాహము తగ్గిపోవును.





Untitled Document
Advertisements