బొప్పాయితో ఇలా చేస్తే మీ ముఖం పై అవాంఛిత రోమాలు మాయం!

     Written by : smtv Desk | Mon, Feb 20, 2023, 04:23 PM

బొప్పాయితో ఇలా చేస్తే మీ ముఖం పై అవాంఛిత రోమాలు మాయం!

కొంతమంది ఎంత తెల్లగా మెరిసే చర్మకాంతి, అందమైన ముఖాకృతి ఉన్నా కూడా ముఖం పై అవాంఛిత రోమాలు ఉన్న కారణంగా చూడడానికి బాగోరు. అటువంటి వారు వారి ముఖంపై వున్న అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతుంటారు. వాటిని తొలగించుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతూ నానాపాట్లు పడుతుంటారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారం వంటింట్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. సింపుల్ గా ఇంట్లో దొరికే వాటితోనే అవాంఛిత రోమాలను వదిలించుకోవచ్చని అంటున్నారు.

దీనికోసం నిపుణులు చెబుతున్న వంటింటి చిట్కాలు.. బొప్పాయి ముక్కలు పేస్ట్ లా చేసుకుని అందులో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకుంటే అవాంఛిత రోమాలు పెరగవని సూచిస్తున్నారు. శనగపిండికి రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకున్నా ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. కాస్త పంచదార, నిమ్మరసం, తేనె, కార్న్ ఫ్లోర్.. మొత్తం బాగా కలిపి ముఖానికి పట్టించి, మసాజ్ చేయడం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయని చెప్పారు.

బాగా పండిన అరటి పండుకు ఓట్స్ కలుపుకుని ముఖానికి రాసుకుని స్క్రట్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుందట. అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి పుదీనా టీ చక్కని ఉపాయమని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా పుదీనా టీ తాగడం వల్ల రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయులు తగ్గుతాయని వివరించారు. ఫలితంగా అవాంఛిత రోమాలు తొలగిపోయి ముఖం మృదువుగా తయారవుతుందని తెలిపారు. మరి ఆలస్యం దేనికి వేలకువేలు డబ్బు తగలేస్తూ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ మీ డబ్బు, సమయం వృదా చేసుకోకుండా వెంటనే ఈ చిట్కాలు ట్రై చేసేయండి.





Untitled Document
Advertisements