పెళ్ళిళ్ళ సీజన్ లో శుభవార్త.. తగ్గిన బంగారం ధర

     Written by : smtv Desk | Sat, Feb 25, 2023, 12:07 PM

పెళ్ళిళ్ళ సీజన్ లో శుభవార్త.. తగ్గిన బంగారం ధర

వేసవి కాలం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్. ఈ సీజన్ లో పెళ్ళిళ్ళ కోసం బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి నిజంగా ఇది శుభవార్త. వరుసగా ఆరో రోజు కూడా పసిడి ధర తగ్గింది. ఈ ఆరు రోజుల్లో తులం బంగారం రూ. రూ.700 వరకూ తగ్గింది. శనివారం 22 క్యారెట్ల పసిడి ధర (10 గ్రాములు)పై రూ. 100 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర (10 గ్రాములు) రూ.51,500గా ఉంది. అయితే 24 క్యారెట్ల పసిడి ధర మాత్రం నిలకడగా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి ధర (10 గ్రాములు) రూ.56,510గా కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పసిడి ధర (10 గ్రాములు) రూ.51,500గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర (10 గ్రాములు) రూ.56,510 పలుకుతోంది. వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండి రూ. 500 వరకూ దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,900 పలుకుతోంది. విజయవాడలో రూ. 70,900గా ఉండగా, విశాఖపట్నంలో రూ. 70,900గా ఉంది. ఢిల్లీలో అత్యల్పంగా కిలో వెండి ధర రూ. 68,300కే లభ్యం అవుతోంది.





Untitled Document
Advertisements