'దేవర' రిలీజ్ ఫై ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే!

     Written by : smtv Desk | Wed, Jan 24, 2024, 01:19 PM

 'దేవర' రిలీజ్ ఫై ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే!

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అభిమానులంత కూడా ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'దేవర' సినిమా కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్ రామ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ చిత్రం యొక్క షూటింగు శరవేగంగా జరుగుతుంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాతో, కథానాయికగా జాన్వీ కపూర్ పలకరించనుంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంకా కీలకమైన .. భారీ సన్నివేశాల చిత్రీకరణ మిగిలే ఉండటం వలన, పాటలను కూడా చిత్రీకరించవలసి ఉన్నందున ఆ సమయానికి రిలీజ్ చేయడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను జూన్ లో గానీ .. ఆగస్టు 15వ తేదీనగాని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. సముద్రతీర ప్రాంతంలో నడిచే ఈ కథలో, సైఫ్ అలీఖాన్ .. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.





Untitled Document
Advertisements