తలిదండ్రులుగా మారబోతున్న టాలీవుడ్ హీరో నిఖిల్ దంపతులు

     Written by : smtv Desk | Thu, Feb 01, 2024, 08:22 AM

తలిదండ్రులుగా మారబోతున్న టాలీవుడ్  హీరో నిఖిల్ దంపతులు

హీరో నిఖిల్ పేరు వినగానే హ్యాపిడేస్ సినిమాలో ఆయన చేసిన అల్లరి గుర్తొస్తుంది. నిఖిల్ టాలీవుడ్ లో నటుడిగా అడుగుపెట్టినప్పటి నుండి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా వెల్లడించాడు. 2020లో తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేసిన నిఖిల్ తాజాగా ఆమె సీమంతం ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, మీ ఆశీస్సులు కావాలని కోరాడు.

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అతడు కథానాయకుడిగా వచ్చిన కార్తికేయ-2 సినిమా రికార్డులు కొల్లగొట్టింది. అంతేకాదు, అతడిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి మూడు నెలలపాటు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు. నిఖిల్ కెరియర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా తెరకేక్కడం విశేషం.





Untitled Document
Advertisements