వరుసగా ఈ వారమంతా థియేటర్ లలో సందడి చేయనున్న సినిమాలివే!

     Written by : smtv Desk | Thu, Feb 01, 2024, 12:02 PM

వరుసగా ఈ వారమంతా థియేటర్ లలో సందడి చేయనున్న  సినిమాలివే!

రేపటి నుండి వరసగా ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ ఐదు చిత్రాలు కూడా చిన్న సినిమాలు కావడం విశేషం. ఒకేవారంలో ఐదుగురు హీరోలు తమ అదృష్టాన్ని పరిక్షించుకొబోతున్నారు. అయితే ఈ ఐదు సినిమాలలో 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాకి మంచి బజ్ ఉంది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాను ధీరజ్ నిర్మించగా, దుష్యంత్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. లక్ష చదలవాడ కథానాయకుడిగా నటించిన 'ధీర' సినిమాను పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కూడా కాస్త గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక సోహెల్ హీరోగా చేసిన 'బూట్ కట్ బాలరాజు' కూడా రేపే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీ కొన్నేటి దర్శకత్వం వహించాడు. యశ్ పూరి కథానాయకుడిగా రూపొందిన 'హ్యాపీ ఎండింగ్' కూడా రేపే ఆడియన్స్ ను పలకరించనుంది. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించాడు. ఇక దయానంద్ దర్శకత్వంలో గీతానంద్ - నేహా సోలంకి జంటగా రూపొందిన 'గేమ్ ఆన్' కూడా రేపు థియేటర్లకు రానుంది. మరి ఈ సినిమాలలో ఏది ఎక్కువ వసూళ్లను రాబడుతుందనేది చూడాలి. ఈ ఐదుగురు హీరోలలో ఎవరు ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తారో చూడాల్సిందే.





Untitled Document
Advertisements