విడాకుల రూమర్లకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టిన ఐశ్వర్యరాయ్

     Written by : smtv Desk | Tue, Feb 06, 2024, 08:58 AM

విడాకుల రూమర్లకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టిన ఐశ్వర్యరాయ్

ఈ ఫొటో చూసిన తర్వాత కూడా అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని చెప్పగలరా?


గతకొంతకాలంగా బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, విడిపోతున్నారు. వారు విడాకులు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారు అంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య గొడవలు వచ్చాయని, ఈ గొడవల కారణంగానే విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లకు ఐశ్వర్యరాయ్ ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు.

ఇవాళ అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు. దాంతో ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కానీ సాయంత్రం వరకు ఐశ్వర్య నుంచి ఎలాంటి శుభాకాంక్షల ప్రకటన రాకపోవడంతో, ఊహాగానాలే నిజమన్న అభిప్రాయం కలిగింది.

అయితే, సాయంత్రం వేళ ఐశ్వర్యరాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు అందరి సందేహాలను పటాపంచలు చేసింది. ఎమోజీలతో ఒక అందమైన పుట్టినరోజు సందేశాన్ని ఐశ్వర్య పోస్టు చేసింది.

"నువ్వు సంతోషకరమైన పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరింత ఆనందం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, ఆయురోగ్యాలు, దేవుడి దీవెనలు నీకు లభించాలని ఆశిస్తున్నాను. ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉండాలి" అంటూ భర్తను ఉద్దేశించి పేర్కొంది.
ఐశ్వర్య పెట్టిన ఈ ఒక్క పోస్ట్ తో వారి విడాకుల పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్టుగా అనిపించింది.








Untitled Document
Advertisements