మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఫ్లాప్ కు కారణం అదే.. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి

     Written by : smtv Desk | Tue, Feb 06, 2024, 09:05 AM

మహేష్ బాబు  ‘గుంటూరు కారం’ ఫ్లాప్ కు కారణం అదే.. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి

కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకులలో ఎస్వీ కృష్టారెడ్డి ఒకరు. 90వ దశకంలో వరుస హిట్లు అందుకున్న దర్శకుల జాబితాలో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన సినిమా అంటేనే హిట్ అనే స్థాయిలో అభిమానుల్లో అంచనాలు ఉండేవి. నాటి సినిమాలు ఇప్పటి తరానికీ పరిచయమే. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఎస్వీ కృష్ణారెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు అపజయం పాలైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. బాలకృష్ణతో తీసిన టాప్ హీరో, నాగార్జునతో తీసిన వజ్రం సినిమాలు అంచనాలు అందుకోలేదని అంగీకరించారు. ఇందుకు గల కారణాలను వివరించిన ఆయన.. హీరో ఇమేజ్‌కు అనుగూణంగా సినిమాలు తీస్తే అపజయం తప్పదని వ్యాఖ్యానించారు.

‘‘ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో..అప్పుడు తేడా కొడుతుంది. ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం చూడండి.. మహేశ్ బాబుకు తగ్గట్టుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ కిందా మీదా పడిపోయారు. ఎప్పుడూ ఇలా చేయకూడదు. కథను నమ్ముకంటే ఫెల్యూర్ అనేదే ఉండదు. అందుకే యమలీల అంత పెద్ద హిట్ అయ్యింది’’ అని ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా పై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.





Untitled Document
Advertisements