చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా హిట్ గా సంచలనం సృష్టించిన 'హను మాన్' .. 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్

     Written by : smtv Desk | Tue, Feb 06, 2024, 12:48 PM

చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా హిట్ గా సంచలనం సృష్టించిన  'హను మాన్' .. 300 కోట్ల క్లబ్ లోకి ఎంటర్

ఒకప్పుడు సినిమా అంటే అందులో నటించిన హీరో ఎవరు అనేది చూసుకుని సినిమా చూడాలా వద్దా అనేది డిసైడ్ చేసుకునే వారు. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ మారిపోయింది. కథలోని పాయింట్ నచ్చితే అది చిన్న హీరో సినిమానా లేదా పేద హీరోనా అనేది చూడట్లేదు. కంటెంట్ బాగున్న సినిమాలను ఆదరించే ట్రెండ్ కొనసాగుతోంది.

అలాంటి ఒక ట్రెండ్ కారణంగానే ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు సైతం పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఆ జాబితాలో ఇటీవల చేరిన సినిమానే 'హను మాన్'. హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసిన తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'హను మాన్' సినిమా చేశాడు. జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి మూడు రోజులకు మించి పట్టలేదు.

అలాంటి ఈ సినిమా నిన్నటితో 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 25 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. పాయింట్ చిన్నదే అయినా దానిని ఇంట్రెస్టింగ్ గా చెబితే పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతుందనే సత్యాన్ని ఈ సినిమా మరోమారు నిరూపించిందని చెప్పచ్చు.





Untitled Document
Advertisements