ఓటీటీ తెరపై సందడి చేయనున్న మరో హారర్ థ్రిల్లర్!

     Written by : smtv Desk | Tue, Feb 13, 2024, 12:02 PM

ఓటీటీ తెరపై సందడి చేయనున్న మరో హారర్ థ్రిల్లర్!

ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు హారర్ థ్రిల్లర్ మూవీస్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే మూవీ మేకర్స్ కూడా హారర్ మూవీస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హారర్ మూవీలో నటించడంలో రితికా సింగ్ మంచి దిట్ట అనే చెప్పుకోవచ్చు. అయితే రితికా సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో 'గురు' సినిమాతో ఆమె ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరువాత హారర్ మూవీ 'శివలింగ'తో, ఇక్కడి ప్రేక్షకులను భయపెట్టేసింది. తమిళ .. మలయాళ భాషల్లోను సినిమాలు చేస్తూ ఆమె ముందుకు వెళుతోంది. అలాంటి రితిక సింగ్ ప్రధానమైన పాత్రగా రూపొందిన సినిమానే 'వళరి'.

'వళరి' అనేది తమిళనాడు ప్రాంతం వైపు ఉపయోగించే ఒక ఆయుధం పేరు. ఆంగ్లేయుల కాలంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించడాన్ని నిషేధించారు. ఈ ఆయుధంతో పాటు దెయ్యం నేపథ్యంతో కూడిన కథతో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈటీవీ విన్ వారు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు.
మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దివ్య పాత్రలో రితికా నటించింది. ఆమె జోడీగా కెప్టెన్ నవీన్ నాయుడు పాత్రలో శ్రీరామ్ కనిపించనున్నాడు. వైవిధ్య భరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది తెలియాలి అంటే చూడాల్సిందే మరి.





Untitled Document
Advertisements