నేటి నుండి ప్రారంభమైన మేడారం మహా జాతర

     Written by : smtv Desk | Wed, Feb 14, 2024, 10:05 AM

నేటి నుండి  ప్రారంభమైన మేడారం మహా జాతర

మేడారం జాతర వనదేవతల జాతరగా ప్రసిద్ది చెందిన జాతర. గిరిజన తెగకు చెందిన ఈ జాతరకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ఇప్పటికే అనేకమంది భక్తులు అమ్మవార్లను సందర్శించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నేడు జరగబోయే ప్రత్యేక పూజలతో మేడారం జాతర ప్రారంభం కానుంది. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈ ఆదివాసీ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి.

పూర్వకాలంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు (చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుడి నిర్మించి పండగ జరుపుకునేవారు. దీనినే మండమెలిగే పండగ అంటారు. ఇందులో భాగంగా పూజారులు పగలంతా తలో పని చేసి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు.





Untitled Document
Advertisements