ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కేజీఎఫ్ స్టార్ యష్.. 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' లో హీరోగా

     Written by : smtv Desk | Wed, Feb 14, 2024, 11:47 AM

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కేజీఎఫ్ స్టార్ యష్.. 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్'  లో హీరోగా

ఈ సంవత్సరం పెద్ద సినిమాల నడుమ సంక్రాంతి బరిలో నిలిచిన 'హనుమాన్' చిత్రం ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రూ. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా సాధ్యమని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు.

మరోవైపు, ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ లో హనుమాన్ హీరోగా ఉంటాడని.. ఈ పాత్రను ఓ స్టార్ హీరో పోషిస్తారని ఆయన తెలిపారు. దీంతో, ఈ పాత్రకు రానాను తీసుకుంటారని ప్రేక్షకులు ఆల్ మోస్ట్ డిసైడ్ అయ్యారు. అయితే, ఈ పాత్రకు కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యష్ ని తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారని తాజా సమాచారం. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యష్ నటిస్తే.. ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది సీక్వెల్ విడుదలవుతుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. అభిమానులంతా హనుమాన్ సీక్వెల్ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





Untitled Document
Advertisements