అందమైన చర్మం కావాలంటే రాత్రి వేళ ఈ పని కచ్చితంగా చేయాలట !

     Written by : smtv Desk | Wed, Feb 14, 2024, 11:12 PM

అందమైన చర్మం కావాలంటే రాత్రి వేళ ఈ పని కచ్చితంగా చేయాలట !

రోజంతా అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుని తిరిగి అలిసిపోయి ఓపిక లేక మేకప్ తీయకుండానే నిద్రపోతూ ఉంటారు అయితే అలా చేయడం వల్ల మేకప్ తాలూకా వ్యర్థాలు మీ చర్మంలోకి చొచ్చుకుపోయి మీ స్కిన్ సెల్స్ ను దెబ్బ తీసే అవకాశం ఉంది అది ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే ఒకవేళ మీకు మేకప్ వేసుకునే అలవాటు ఉంటే ముందుగా మీ మొహం పై ఉన్న మేకప్ అంతా ఏదైనా నూనెతో కానీ మేకప్ రిమూవర్ ఉదాహరణకి మిసల్లార్ వాటర్ తో కానీ మీ చర్మాన్ని శుభ్రపరచవచ్చు. ఇలా చేయడం వల్ల మీ చర్మం పై పేరుకున్న దుమ్ము, ధూళి మొత్తం తుడుపెట్టుకుపోతాయి. అలాగే మీ చర్మం పాడవకుండా ఉంటుంది.

* ఇప్పుడు మీ మొహాన్ని ఏదైనా ఫేస్ వాష్ ఆర్ క్లెన్సర్ తో శుభ్రంగా కడగండి. గుర్తుంచుకోండి మొహం మీదున్న మేకప్ తీయకుండా మొహం కడగడం అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మీ చర్మం పై ఉన్న వ్యర్థాలు పూర్తిగా తొలగిపోవు అందుకోసం ఎక్కువ క్లెన్సర్ పెట్టీ ఎక్కువ సమయం మొహం రుద్దల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ చర్మంలో సహజమైన నూనె శాతం తగ్గి చర్మం పొడిగా అయిపోతుంది. అందుకే మేకప్ అంత తీసేసిన తరువాత మాత్రమే మొహాన్ని కడగాలి.

* మొహం ఆరిన తరువాత మీ మొహం పై ఉన్న మచ్చలు పోవడం కోసం సీరం అప్లై చేయడం మంచిది. రాత్రి పూట సీరం అప్లై చేయడం వలన గరిష్ట చర్మ మరమ్మత్తు మరియు పునరుద్ధరణ మంచిగా జరుగుతుంది. అలాగే ఇది మీ చర్మ తత్వాన్ని మెరుగుపరిచి వయసు మీద పడే లక్షణాలను దూరం చేస్తుంది.

* చివరగా మీ చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది రాయడం వల్ల మేకప్ ప్రొడక్ట్స్ వల్ల పొడిబారిన చర్మానికి తేమ అంది మొహాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది.

ఈ చర్మ సంరక్షణ ప్రతి రోజు రాత్రి పూట పాటించడం వల్ల మీ చర్మ తత్వం మరుగుపడడమే కాక మరుసటి రోజు కోసం మీ చర్మాన్ని పూర్తిగా సిద్దం చేయడంలో సహాయపడుతుంది. మేకప్ వేసుకుంటేనే కాదు వేసుకోకున్నా సరే రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుని పడుకుంటే మీ చర్మం తాజాగా కనిపిస్తుంది.





Untitled Document
Advertisements