ఇలా చేస్తే చూసే వారి కళ్ళు మీ పాదాలపై నుండి పక్కకు పోవు!

     Written by : smtv Desk | Wed, Feb 14, 2024, 11:17 PM

ఇలా చేస్తే చూసే వారి కళ్ళు మీ పాదాలపై నుండి పక్కకు పోవు!

ఫిజికల్ అపియరెన్స్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది మొహం. అందుకే అందంగా కనిపించాలి అని ముఖం కొరకు అనేక జాగ్రతలు తీసుకుంటారు. ముఖ్యంగా ఎండకు చర్మం కమిలిపోయి నల్లటి మచ్చలు ఏర్పడకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కాళ్ళని మర్చిపోతూ ఉంటారు. మన మోహంలానే ఎండ కారణంగా కాళ్ళు కూడా ట్యాన్ అవుతూ ఉంటాయి. చాలా మందికి ఈ విషయం తెలిసినా అంతగా పట్టించుకోరు. మొత్తమంతా బాగుండి కాళ్ళు బాగాలేకపోతే చూడడానికి అంత బాగోదు కదా. అయితే మీకు అనిపించచ్చు మొహం కోసమంటే ఎంతైనా పెట్టచ్చు కాళ్ళ గురించి అంత చేయాలా అంత డబ్బు ఖర్చు పెట్టాలా అని అస్సలు అవసరం లేదు. మీ పాదాలను అందంగా ఉంచేందుకు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

1. ముందుగా ఏదైనా బకెట్ లేదా పొడవుగా ఉన్న టబ్ లాంటి దానిలో గోరు వెచ్చని నీళ్ళు, కొంచం బేకింగ్ సోడా వేయండి. అందులో ఒక కప్ పాలు కూడా పోయండి. ఇప్పుడు మీ కాళ్ళను కొద్దిసేపు అందులో ఉంచండి. ఆ తర్వత కాళ్ళను బయటకి తీసేయండి. ఇక్కడ బకెట్ లేదా పొడవైన టబ్ ఎందుకు అంటే ఎండ కారణంగా నల్లబడిపోయిన మీ పాదాల మాత్రమే కాక మీ కాళ్ళు కూడా శుభ్రపడతాయి.

2. ఇప్పుడు తడిగా ఉన్న మీ కాళ్ళను ప్యుమైస్ స్టోన్ అని చర్మం కోసం ప్రత్యేకించి ఒక రాయి ఉంటుంది. దాని సహాయంతో మీ అరిపాదాల మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా మెల్లిగా తొలగించండి. మీరు మీ కాళ్ళను నీటిలో ఉంచినప్పుడు బేకింగ్ సోడా మీ కాళ్ళకి ఉన్న దుమ్ము, ధూళిని లాగేస్తుంది. ఇక పాలు మీ అరిపాదాల చర్మం కొంచం మెత్తబడేలా చేసి డెడ్ స్కిన్ సులువుగా ఊడి వచ్చేసేందుకు సహాయపడుతుంది. లేదా మీరు మీ చర్మాన్ని రాయితో రుద్దేటప్పడు అది చిట్లి రక్తం వచ్చే అవకాశం ఉంది.

3. ఇప్పుడు ఒక చిన్న కప్ లో బియ్యం పిండి లేదా గోధుమపిండి తీసుకుని అందులో ఒక చెంచా తేనె ఇంకా కొన్ని పాలు పోసి వాటిని కలుపుతూ మిశ్రమంలా తయారుచేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ కాళ్ళకు పట్టించి కొంచం సేపు బాగా మర్ధన చేయండి. ఇలా చేయడం వల్ల మీ పాదాల మీద ఉన్న నలుపు తగ్గడమే కాక కాళ్ళు కొంచం మెత్తబడతాయి. కొంతసమయం తరువాత మీ కాళ్ళని నీటితో కడిగేయండి. అలాగే మీ కాళ్ళని ఒక మెత్తని టవల్ లేదా క్లాత్ తో శుభ్రంగా తుడవండి. వేళ్ళ సందుల్లో తుడవడం మాత్రం అస్సలు మర్చిపోకండి లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇక చివరిగా మీరు రోజూ ఉపయోగించే బాడీ లోషన్ లో ఏదైనా ఒంటికి ఉపయోగించే నూనెని జోడించి మీ పాదాలకు రాయండి. దీని వల్ల మీ కాళ్ళు మృదువుగా ఉంటాయి. ఇలా మీ కాళ్ళకి ఉన్న ట్యాన్ బట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.\

కాస్త ఓపిక చేసుకుని ఈ చిన్న టిప్స్ పాటిస్తే గనుక మీ ముఖంలానే కాళ్ళు కూడా అందంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్శిస్తాయి.





Untitled Document
Advertisements