ఈ జాగ్రత్తలతో కంటిచూపే కాదు కంటి అందం కూడా పదిలం..

     Written by : smtv Desk | Wed, Feb 14, 2024, 11:20 PM

ఈ జాగ్రత్తలతో కంటిచూపే కాదు కంటి అందం కూడా పదిలం..

మన పెద్దలు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. కానీ ప్రస్తుత కాలంలో దురదృష్టవశాత్తు చిన్న పిల్లవాడి నుండి పండు ముసలి వరకు దాదాపు అందరికీ కంటి చూపు పెద్ద సమస్యగా మారింది. ఇంకా కొంతకాలం పొతే అప్పుడే పుట్టిన పిల్లాడికి కళ్ళద్దాలు వాడాల్సివచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. కంటి చూపు తగ్గిపోతే శస్త్రచికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు కానీ సహజ పద్దతిలో తగ్గించుకోవడం మాత్రం కష్టమనే చెప్పాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ కంటిచూపు మరింత దిగాజరిపోకుండా కాపాడుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఎంటో తెలుసుకుందాం..

మీ కంటి చూపును క్రమం తప్పకుండా మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి వైద్యుని చేత పరీక్షించుకోవడం వల్ల మీ కళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో తెలియడమే కాక మీ కంటికి ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో కూడా తెలుస్తుంది.

విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్లు, గుడ్లు, పాలు, బొప్పాయి లాంటివి తరుచూ ఆహారంగా తీస్కోవడం వల్ల కంటికి చాలా మేలు కలిగిస్తాయి.

పాలకూర, మునగాకు, పొన్నగంటి కూర లాంటి ఐరన్ పుష్కలంగా ఉండే ఆకు కూరలు తినడం వల్ల ఒంట్లో రక్త శాతం పెరగడమే కాక కంటికి కూడా చాలా మేలు చేస్తాయి.

డయాబెటిస్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి చూపు మందగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు మీ బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోండి.

ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా మొబైల్ చూసేవాళ్ళు ప్రతీ ఇరవై నిమిషాలకు ఒకసారి మీకు ఎరవై అడుగుల దూరంలో ఉండే ఏదైనా వస్తువు కొంతసేపు చూడాలి. ఇలా చేయడం వల్ల కళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

రోజు ఉదయం లేదా సాయంత్రం మీకు వీలు కుదిరినప్పుడల్లా కంటికి సంబంధించిన వ్యాయామాలు అంటే ఐ రోటేషన్స్ లాంటివి చేయడం వల్ల కంటికి రక్త సరఫరా బాగా జరుగుతుంది.

రోజూ చల్లని నీటితో కళ్ళను క్రమం తప్పకుండా పలు మార్లు కడిగినట్లైతే కళ్ళలో ఉన్న దుమ్ము, ధూళి పోవడమే కాక కంటి నారాలకి రక్త సరఫరా జరుగుతుంది.

రోజు ఉదయాన్నే పచ్చని గడ్డిలో కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల ద్వారా భూమిలో ఉన్న శక్తి మన శరీరంలోకి వెళ్తుంది. అంతేకాక కళ్ళకి సంబంధిన కనెక్షన్ అరికాలి దగ్గర ఉండడం వల్ల అది కంటికి మేలు చేస్తుంది.

బయటకి వెళ్ళేటప్పుడు కళ్ళకి సన్ గ్లాసెస్ పెట్టుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల హానికరమైన సూర్యుని కిరణాల బారి నుండి మన కళ్ళను రక్షించుకొగలుగుతాము.

పడుకునే ముందు గోరు వెచ్చని నీటిలో ఒక గుడ్డను ముంచి అది కళ్లపై పెట్టినట్లైతే కళ్లపై పడిన ఒత్తిడి మటు మాయమైపోతుంది. రోజు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర మన శరీరంతో పాటు ఒంటికి కూడా చాలా మంచిది.

పైన చెప్పినట్టుగా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మన కంటిచూపుతో పాటు కళ్ళ అందాన్ని కూడా కాపాడుకోవచ్చు.





Untitled Document
Advertisements