'దంగల్' బాలనటి సుహానీ భట్నాగర్ మృతి..

     Written by : smtv Desk | Sat, Feb 17, 2024, 04:59 PM

'దంగల్' బాలనటి సుహానీ భట్నాగర్ మృతి..

కుస్తీల పోటీ నేపధ్యంలో వచ్చిన దంగల్ చిత్రానికి చాల మంచి పేరు వచ్చింది. సినిమా వచ్చి ఏళ్ళు గడిచినా ఇప్పటికి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కుస్తీ యోధుడు మహావీర్ ఫోగాట్, ఆయన కుమార్తెలు గీతా ఫోగాట్, బబితా ఫోగాట్ ల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం దంగల్. ఇందులో అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే, ఇందులో అమీర్ ఖాన్ కుమార్తె బబిత చిన్నప్పటి పాత్ర పోషించిన సుహానీ భట్నాగర్ కన్నుమూసింది.

ఆమె వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సుహానీ భట్నాగర్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. సుహానీ ఢిల్లీ శివారు ఫరీదాబాద్ లోని సెక్టార్-17లో నివాసం ఉంటోంది. ఆమె అంత్యక్రియలు అజ్రోండా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.





Untitled Document
Advertisements