మేడారం భక్తులకు అలర్ట్.. బస్సుల్లో వాటిని తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

     Written by : smtv Desk | Mon, Feb 19, 2024, 09:28 PM

మేడారం భక్తులకు అలర్ట్..  బస్సుల్లో వాటిని తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్న టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

రాష్ట్రం నలుమూలల నుండి వనదేవతల జాతరగా చెప్పుకోబడే మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు భక్తులు అశేషంగా తరలి వెళుతున్నారు. అయితే జాతర కొరకు ఆర్టీసీ బస్సులలో వెళ్ళే వారికి బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు అవకాశం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ వేలాది బస్సులను మేడారంకు నడుపుతోంది. అయితే వీటిలో మూగజీవాలకు ఎంట్రీ లేదని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకు రాకుండా భక్తులు సహకరించాలని కోరారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆరు వేలకు పైగా బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని మేడారంలో 15 కిలో మీటర్ల మేర 48 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణీకుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. మరి భక్తులు సిబ్బందికి ఏమేరకు సహకరిస్తారు అనేది చూడాలి.





Untitled Document
Advertisements