వేమిరెడ్డిని కలిసిన కోటంరెడ్డి.. రసవత్తరంగా మారిన నెల్లూరు రాజకీయాలు

     Written by : smtv Desk | Wed, Feb 21, 2024, 07:45 PM

వేమిరెడ్డిని కలిసిన కోటంరెడ్డి.. రసవత్తరంగా మారిన నెల్లూరు రాజకీయాలు

ఎన్నికల ముంగిట ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీలో కీలకం అనుకున్న నేతలు పార్టీని వీడడంతో పార్టీ అధిష్టానం గందరగోళంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయడం తెలిసిందే. ఇప్పటికే వేమిరెడ్డిని టీడీపీలోకి రావాలంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగంగా ఆహ్వానించారు. తాజాగా, వేమిరెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిశారు.

వైసీపీ బహిష్కరణకు గురైన కోటంరెడ్డి ఇటీవల కాలంలో టీడీపీతో కలిశారు. ఇప్పుడాయన వేమిరెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ కుట్రలు భరించలేకే వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారని వెల్లడించారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి వేమిరెడ్డి కృషి చేశారని తెలిపారు. వైసీపీ గెలుపునకు పాటుపడిన వేమిరెడ్డికి అవమానాలే దక్కాయని అన్నారు. వేమిరెడ్డిని టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తామని కోటంరెడ్డి చెప్పారు.





Untitled Document
Advertisements