మరో రెండు రోజుల్లో కేంద్రం నుండి తెలంగాణ వాహన నెంబర్ ప్లేట్‌ మార్పు పై నోటిఫికేషన్!

     Written by : smtv Desk | Sat, Feb 24, 2024, 07:10 AM

మరో రెండు రోజుల్లో కేంద్రం నుండి  తెలంగాణ వాహన నెంబర్ ప్లేట్‌ మార్పు పై నోటిఫికేషన్!

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వాహనాలపై టీఎస్ అనే అక్షరాలను చూసి అది తెలంగాణకు చెందిన వెహికిల్ గా గుర్తించాము. ఇకమీదట కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. రిజిస్ట్రేషన్ కోడ్‌లో మునుపటి టీఎస్‌కు బదులు టీజీ చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ నెల 5న లేఖ రాసింది. రవాణాశాఖ సంయుక్త కమిషనర్ పాండురంగనాయక్ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కూడా కలిశారు. అయితే, ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేంద్ర నిర్ణయించినట్టు తెలుస్తోంది.

కేంద్ర ఉత్తర్వులు వచ్చిన వెంటనే రాష్ట్ర రవాణాశాఖ కూడా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కోడ్‌తో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. అయితే, ఈ మార్పును ప్రభుత్వం కొత్త వాహనాలకే పరిమితం చేసింది. పాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.





Untitled Document
Advertisements