ఆటో డ్రైవర్ ఘాతుకం.. విశాఖలో యువతి కిడ్నాప్‌నకు యత్నం

     Written by : smtv Desk | Tue, Feb 27, 2024, 11:29 AM

ఆటో డ్రైవర్ ఘాతుకం.. విశాఖలో యువతి కిడ్నాప్‌నకు యత్నం

ఎదో పని నిమిత్తం బయటకు వచ్చిన యువతి తాను వేలవలసిన చోటుకి చేరుకునేందుకు రోగ్గు మీద ఓ ఆటో ఎక్కింది. అయితే తన ఆటో ఎక్కిన యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాక, ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడో ఆటో డ్రైవర్. దీంతో అప్రమత్తమైన యువతి వేగంగా వెళ్తున్న ఆటో నుంచి కిందికి దూకి తప్పించుకుంది. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది.
ఆటో నుంచి కిందికి దూకి తీవ్రంగా గాయపడిన యువతిని చూసిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, బాధితురాలు కిందికి దూకడం, జనం గుమికూడడంతో ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ మధ్య వరుసగా ఆటో డ్రైవర్ ల రూపంలో దొంగతనాలు, కిడ్నాప్ లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.





Untitled Document
Advertisements