ఎడారి మొక్కలో ఇన్ని ప్రయోజనాలా!

     Written by : smtv Desk | Thu, Feb 29, 2024, 09:57 AM

ఎడారి మొక్కలో ఇన్ని ప్రయోజనాలా!

మన భారతదేశంలో పెరిగే మొక్కలలో చాలా తక్కువ నీటిని ఉపయోగించుకొని ఎన్నో ప్రయోజనాలను ఇచ్చేటువంటి మొక్క కలబంద దీనిని మనము ఎన్నో రకాల ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చును దీనిని ఎండాకాలంలో ఎండ వేడిమి వచ్చినప్పుడు గుజ్జును తీసుకొని తాగటం వలన వేడి తగ్గుతుంది దీనిని ఎప్పటినుంచో ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉన్నారు ఓ అందమైన అమ్మాయిలు మీ అందాన్ని పెరుగుపరుచుకోవడానికి కలబంద ఉపయోగించుకొని మీ మొహం పైన ఉన్నటువంటి మొటిమలను ఈజీగా తొలగించుకోవచ్చును ఉదయాన్నే పరగడుపున కలబంద జ్యూస్ ను తాగటం వలన ఉదర సంబంధిత వ్యాధులను దరిచే కుండా చేసుకోవొచ్చును అంతేకాకుండా కలబంద జ్యూస్ ని పసుపుతో కలిపి తాగటం వల్ల స్ప్లిన్ లివర్ వ్యాధులను రాకుండా చేస్తూ ఉంటుంది

మేక‌ప్ రిమూవ‌ర్

చాలా మంది మ‌హిళ‌లు నిత్యం తాము వేసుకుని మేక‌ప్‌ను తీసేందుకు మేక‌ప్ రిమూవ‌ర్ల‌ను వాడుతుంటారు. అవి సాధార‌ణంగా కెమిక‌ల్స్‌తో త‌యారైన‌వే అయి ఉంటాయి. అవి చ‌ర్మానికి హాని చేస్తాయి. వాటితో చ‌ర్మం పొడిగా మారి క‌ణాలు న‌శిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే అలొవెరా జెల్‌ను వాడ‌వ‌చ్చు. అలొవెరా జెల్‌ను మేక‌ప్ రిమూవ‌ర్‌గా వాడ‌వ‌చ్చు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. పైగా చ‌ర్మం సంర‌క్షింప‌బ‌డుతుంది. కలబంద జ్యూస్ ను జుట్టుకు పెట్టుకోవడం వలన జుట్టు చాలా మృదువుగాను కాంతివంతంగానూ మెరుస్తూ ఉంటుంది అంతేకాకుండా కలబందలో ఏ విటమిన్ ఉండటం వల్ల ఇది కంటికి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తూ ఉంటుంది కలబందను టైప్ టు డయాబెటిస్ వాళ్ళు సేవించడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుచుకోవచ్చును

చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు

క‌ల‌బంద ఆకుల్లో ఉండే గుజ్జుతో ప‌లు ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుని కొద్ది నిమిషాల త‌రువాత క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీన్ని కిచెన్‌లో ఉండే ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి ఫేస్ ప్యాక్‌లను త‌యారుచేసుకుని వాడ‌వ‌చ్చు. అలాగే కాలిన గాయాలు, పుండ్లు, ఇత‌ర మ‌చ్చ‌ల‌పై అలొవెరా జెల్‌ను రాస్తూ ఉంటే అవి మానిపోతాయి.

వెంట్రుక‌ల‌కు

అలొవెరా వెంట్రుక‌ల‌ను కూడా సంర‌క్షిస్తుంది. జుట్టు రాల‌డాన్ని అరిక‌డుతుంది. అలొవెరా జెల్‌ను జుట్టుకు, జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా
బాగా మ‌ర్ద‌నా చేస్తూ రాయాలి. అనంత‌రం కొంత సేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తే చుండ్రు స‌మస్య పోతుంది.
వెంట్రుక‌లు రాల‌వు. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.

పాదాల ప‌గుళ్ల‌కు


పాదాల ప‌గుళ్ల స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ఈ స‌మ‌స్య‌కు అలొవెరాతో చెక్ పెట్ట‌వ‌చ్చు. అలొవెరా జెల్‌లో
కొద్దిగా చ‌క్కెర క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాసి బాగా రుద్దాలి. దీంతో పాదాల‌పై ఉండే మృత‌క‌ణాలు పోతాయి. పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి. అయితే అలొవెరాకు చ‌క్కెర‌కు బ‌దులుగా తేనెను కూడా క‌లిపి పాదాల‌కు రాయ‌వ‌చ్చు. ఇలా చేసినా ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది.

కలబందలో ఎన్నో రకాలైనటువంటి విటమిన్లు మినరల్స్ ఉండటం వలన దీనిని సేవించటం వలన మనం ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు అంతేకాకుండా దీని రోజు సేవించడం వల్ల మన జీవశక్తి కూడా మెరుగుపడుతూ ఉంటుంది ఇలా ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి కలబందను మనము పెరట్లో పెంచుకొని మన ఆరోగ్య అవసరాలకు ఉపయోగించుకోవాలి





Untitled Document
Advertisements