వంటింటి వస్తువులతో పార్లర్ లాంటి నిగారింపు మీసొంతంగా!

     Written by : smtv Desk | Fri, Mar 01, 2024, 09:53 AM

వంటింటి వస్తువులతో పార్లర్ లాంటి నిగారింపు మీసొంతంగా!

నేటి తరం మహిళలు తమ ముఖం ఎంతో అందంగా కాంతివంతంగా కనపడాలని ఆరాటపడుతూ ఉంటారు దాని కోసము నిత్యం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. పార్లర్ లలో వాడే ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించినటువంటి కెమికల్ కారణంగా తమ ముఖాన్ని ఇంకా అంద విహీనంగా చేసుకుంటారు. అలా కాకుండా మనం ఇంటిలోనే వాడేటువంటి వంటింటి వస్తువులతో ఈ చిట్కాలను పాటించి మన మొహాన్ని ఎంతో అందంగా, కాంతివంతంగా కనిపించవచ్చు.

ఇంటి చిట్కాల కొరకు మనం ఇంట్లో ప్రయోగించదగ్గ ఫేస్ ప్యాక్స్ చాలా రకాలుగా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాము మనం బ్యుటీషియన్ దగ్గరకు వెళితే ఆమె కూడా మన చర్మానికి నప్పే ఫేషియల్ వేస్తుందనే గ్యారంటీ లేదు. ఇలాంటప్పుడు మనకు కూడా క్లియర్ స్కిన్ పొందడమనేది అసాధ్యమైపోతుంది. ఒకవేళ ఆ సమయానికి.. చర్మంలో ప్రకాశవంతమైన మార్పు కనిపించినా.. అది తాత్కాలిక ఫలితమే అవుతోంది. సహజమైన చిట్కాల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు చర్మాన్ని మెరిపించే నేచురల్ టిప్స్ గురించి తెలుసుంకుందాం..

టమాటా, ఎర్ర కందిపప్పు, కలబంద.. ట్యాన్ పోగొట్టుకోవడంతో పాటు చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవడానికి టమాటా, ఎర్రకందిపప్పు, కలబందతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు తీసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. నానిన కందిపప్పులో చెంచా టమాటా గుజ్జు, కొద్దిగా కలబంద గుజ్జు కూడా కలిపి బ్లెండర్లో వేసి మెత్తటి గుజ్జుగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంపై ఉన్న ట్యాన్ పోతుంది.

బొప్పాయి, తేెనె ఫేస్ ప్యాక్.. బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ చర్మంపై మ్యాజిక్ చేస్తాయి. ఇవి చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంతో పాటు మృతకణాలను తొలిగించి చర్మాన్ని అందంగా మారుస్తాయి. తేనెలోని గుణాలు చర్మానికి పోషణనిస్తాయి.బాగా ముగ్గిన బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

స్ట్రాబెర్రీ , మిల్క్ క్రీం మిశ్రమం .. స్ట్రాబెర్రీ, మిల్క్ క్రీంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ట్యాన్ ను చాలా ప్రభావవంతంగా పోగొడుతుంది. అంతేకాదు డార్క్ స్పాట్స్ ని సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది.కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని స్పూన్ సాయంతో లేదా బ్లెండర్ లో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

శెనగపిండి, పాలు, తేనె.. ఈ మూడు పదార్థాల్లోనూ సహజ సిద్ధమైన ఎక్స్ఫోలియేటింగ్ గుణాలున్నాయి. ఇవి చర్మ గ్రంథుల నుంచి విడుదలయ్యే నూనెలను క్రమబద్ధీకరిస్తాయి. అంతేకాదు చర్మకణాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ చేసి సహజమైన మెరుపును అందిస్తాయి.గిన్నెలో టీస్పూన్ శెనగపిండి, అరకప్పు పాలు, ఒక స్కూప్ తేనె తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మాస్క్ ను 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఈ సమయంలో దాన్ని తాకకూడదు. నిర్ణీత సమయం తర్వాత మైల్డ్ సోప్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది.

ఎగ్ వైట్.. గుడ్డులోని తెల్లసొనలో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణ ఇచ్చి ముడతలు పడకుండా చూస్తాయి. అలాగే చర్మానికి అవసరమైన ఇతర పోషకాలు సైతం తెల్ల గుడ్డు సొనలో లభిస్తాయి.గుడ్డు అందించే ఈ ఫలితాన్ని పొందడానికి.. ఎగ్ వైట్ లో కొద్దిగా మిల్క్ క్రీం, కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

బంగాళా దుంప.. బంగాళాదుంపలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం యవ్వనంగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెరిగేలా చేస్తుంది. దీనివల్ల చర్మం సాగిపోదు. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.బంగాళాదుంపను ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా తయారుచేయాలి. దీన్ని పలుచని వస్త్రంలో వేసి బాగా పిండి రసాన్ని వేరు చేయాలి. ఈ పొటాటో జ్యూస్ లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పావు గంట తర్వాత చల్లని నీటితో దీనిని కడిగేసుకొంటే సరిపోతుంది. బంగాళాదుంప రసాన్ని తీసేటప్పుడు నీరు కలపకూడదు.

చూసారు కదా మన కిచెన్ లో దొరికే వస్తువులతో మన అందాన్ని ఎలా పెంచుకోవచ్చు అనేది. మరి అలాస్యం దేనికి వెంటనే మేరు కూడా ట్రై చేసి మీ చర్మం యొక్క నిగారింపుని పెంచుకొండిక.





Untitled Document
Advertisements