ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరిక..

     Written by : smtv Desk | Sat, Mar 02, 2024, 10:52 AM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు ఈసీ హెచ్చరిక..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయమని తెలుస్తోంది. వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పార్టీలు ఓట్లు అడిగే ప్రయత్నం చేయవద్దని పార్టీలకు స్పష్టం చేసింది. ప్రచారం కోసం ప్రార్థనా మందిరాలను వాడుకోవద్దని పేర్కొంది.

ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్లను మోసగించేలా తప్పుడు ప్రకటనలు చేయరాదని, భాష, కుల, మత, వర్గ ప్రస్తావన తీసుకురావద్దని ఈసీ వెల్లడించింది. అవాస్తవ ప్రకటనల జోలికి వెళ్లొద్దని, ముఖ్యంగా, సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది. రాజకీయ ప్రత్యర్థులను దూషించే పోస్టులు, వారిని అవమానించే పోస్టులు పెట్టరాదని స్పష్టం చేసింది.

ఇక, గతంలో నోటీసులు అందుకున్న ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది.

ఎన్నికల ప్రచారంలో విభజనవాదం, వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలని.. సమస్యలే అజెండాగా ఎన్నికల్లో ప్రచారం సాగించాలని, సుహృద్భావభావంతో రాజకీయ చర్చలను ప్రోత్సహించాలని వివరించింది. ఎన్నికల కోడ్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏ సమయం లో పార్టీలు ఏవిధంగా వ్వవహరిస్తాయో ప్రజలకు అర్థం కావడం లేదు . ఏ పార్టీ అయినా ప్రజలకు మేలు చేసి వారి అవసరాలను తీర్చాలి అని కోరుకుంటున్నాయి . ప్రజలు రాజకీయ నాయకులు చెప్పే మాటలకూ, చూపించే తయిలాలకు తలొగ్గకుండా ప్రజల కొరకు పనిచేసే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఈసీ సూచించింది. మరి ఎపీలోని రాజకీయ పార్టీలు ఈసీ ఆదేశాలను ఏ మేరకు పాటిస్తాయి అనేది చూడాలి.





Untitled Document
Advertisements