ఈజీగా ఓట్స్ దోశ వేసేయండిలా..

     Written by : smtv Desk | Mon, Apr 01, 2024, 10:15 AM

ఈజీగా ఓట్స్ దోశ వేసేయండిలా..

ఈ మధ్య కాలంలో ప్రతి ఒకరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఇష్ట పడుతున్నారు . అలాంటి ఆహారంలో ఓట్స్ ఒకటి.అయితే కొంతమంది ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తినేవారు ఉన్నారు . వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా వారు గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు. అలాగే డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా వారికి దూరంగా ఉంటాయి. పాలల్లో ఓట్స్ వేసుకొని తినే వారి సంఖ్య ఎక్కువే. అలాగే పెరుగులోనూ ఓట్స్ వేసుకొని తింటూ ఉంటారు. అయితే దీని రుచి చాలా మందికి నచ్చదు. ఇలాంటివారు ఓట్స్‌తో అప్పటికప్పుడు దోశెలు వేసుకొని తిని చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో తింటే ఈ దోశ అదిరిపోతుంది.


ఓట్స్ దోశ రెసిపీకి కావలసిన పదార్థాలు:

ఓట్స్ - ఒక కప్పు

ఉప్మా రవ్వ - ఒక స్పూను

బియ్యప్పిండి - ఒక స్పూను

మెంతులు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాల పొడి - పావు స్పూను

కరివేపాకులు - గుప్పెడు

తురిమిన అల్లం - ఒక స్పూను

పచ్చిమిర్చి - ఒకటి

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉల్లిపాయ - మూడు స్పూన్లు

నూనె - సరిపడినంత

ఓట్స్ దోశ తయారీ విధానం :

1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట మీద ఓట్స్ వేయించుకోవాలి.

2. అందులో మెంతులు కూడా వేయాలి.

3. ఈ తర్వాత స్టవ్ కట్టేసి ఓట్స్, మెంతులు కలిపి మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకోవాలి.

4. ఒక గిన్నెలో ఈ పొడిని వేయాలి. ఆ గిన్నెలోనే ఉప్మా రవ్వ, బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి.

5. అందులోనే పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం తురుము, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి.

దానికి సరిపడినంత నీటిని కూడా వేసుకోవాలి.

6. దోశ వేయడానికి సరిపడా మందంగా పిండిని కలుపుకోవాలి.

7. ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.

8. ఇందులో పులిసిన పెరుగును వేస్తే టేస్టీగా ఉంటుంది.

9. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి పెనం పెట్టి నూనె వేయాలి.

10. ఆ పెనంపై ఓట్స్ పిండితో దోశలుఎలా వేసుకుంటారో ఆలా వేసుకోవాలి.

11. ఇది క్రిస్పీగా వస్తుంది. రెండు వైపులా రంగు మారేవరకు కాల్చుకుంటే సరిపోతుంది.

12. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే మీకు కావలసిన దోస రెడీ .

ఓట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి, మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ లో తినడం మరీ ముఖ్యం. ఆ రోజంతా శరీరాన్ని నీరసపడకుండా కాపాడుతుంది. దీనిలో మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం, జింక్, బీ విటమిన్లు దీనిలో అధికంగా ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. డయాబెటిస్ బారిన పడినవారు, ఊబకాయంతో బాధపడుతున్న వారు, గుండె సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తో చేసిన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా అడ్డుకుంటుంది. ఒకరోజు ఓట్స్ పెరుగులో వేసుకొని తినండి. రెండో రోజు పాలల్లో వేసుకొని తినండి. మూడోరోజు ఇలా దోశె చేసుకొని తినండి. ఇంకొకరోజు ఓట్స్ తో ఉప్మా చేసుకొని తినండి. ఇలా ఓట్స్ తో అనేక రకాల ఆహారాలు చేసుకుని బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల మీరు అనేక అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉంటారు .





Untitled Document
Advertisements