చైత్ర నవరాత్రుల్లో లవంగాలతో ఇలా చేస్తే ఇబ్బందులు అన్ని తొలగిపోతాయట

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 09:23 AM

 చైత్ర నవరాత్రుల్లో లవంగాలతో ఇలా చేస్తే ఇబ్బందులు అన్ని తొలగిపోతాయట

మన తెలుగు వారికీ కొత్త సంవత్సరం అనేది చైత్ర మాసం పాడ్యమి నుండి మొదలు అవుతుంది . చైత్ర పాడ్యమిని ఉగాది అని అంటారు . ఈ సంవత్సరం ఏప్రిల్ 9 న ఉగాది పండుగ వస్తుంది . ఆ రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి . కావున ఈ రోజుల్లో అనగా చైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే బలం, ఆనందం, శాంతి సౌభాగ్యాలను పొందే అవకాశం ఉంది. చైత్ర నవరాత్రుల సమయంలో, మీరు గ్రహ ,దోషాలను తొలగించడానికి, డబ్బు ఇబ్బందులను అధిగమించడానికి లేదా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి. ఈ సమయంలో లవంగాలతో చిన్న రెమెడీ పాటిస్తే ఆర్ధికంగా కలిసి వస్తుంది.

చాల మందికి తెలియకుండానే , రాశిచక్రంలో రాహు, కేతువుల దోషాల కారణంగా ఆందోళనలు ఎక్కువవుతూ ఉంటాయి. నవరాత్రులలో 9 రోజుల పాటు శివలింగానికి లవంగాలను సమర్పించండి. దీనివల్ల రాహు, కేతువుల దుష్ప్రభావాలు తొలగిపోతాయి. ఈ రెండు గ్రహాలు ప్రశాంతంగా ఉంటాయి.మొదలుపెట్టిన పనిని విజయవంతం అవ్వాలంటే, చైత్ర నవరాత్రులలో పూజ సమయంలో హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంతో రెండు లవంగాలను ఉంచండి. దీనివల్ల నెగిటివిటీ తొలగిపోయి పని విజయవంతమవుతుంది.శత్రువులపై విజయం సాధించాలంటే చైత్ర నవరాత్రుల సమయంలో హనుమంతుడికి లడ్డూలు సమర్పించండి. హనుమాన్‌ చాలీసాను 7 సార్లు పఠించి, 5 లవంగాలతో కర్పూరాన్ని వెలిగించండి . ఆ రోజు బూడిదతో బొట్టు పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాలి.ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే పసుపు కొమ్ములు లవంగాలను ఎర్రటి వస్త్రంలో కట్టాలి. ఆ ముడుపును డబ్బు స్థానంలోఉంచండి. అలాగే, పసుపు వస్త్రంలో రెండు లవంగాలను కట్టి పూజా చేసే స్థలంలో భద్రంగా ఉంచండి పేదరికాన్ని నిర్మూలిస్తుంది.మీరు చేసే పనిలో విజయం కోసం, చైత్ర నవరాత్రులలో నూనె దీపాలతో శ్రీ హనుమంతుడి హారతి ఇవ్వండి. అందులో రెండు లవంగాలు వేయండి . అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాల కోసం దుర్గామాతను పూజించేటప్పుడు రెండు లవంగాలను సమర్పించండి. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.కుటుంబంలో ప్రశాంతత కోసం, రెండు లవంగాలను పసుపు వస్త్రంలో కట్టండి. దాన్ని ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయండి. అది ఇతరులకు కనిపించకూడదు, రహస్య ప్రదేశంలో ఉంచాలి.ఈ విధంగా చైత్ర మాసంలో చిన్న చిన్న మార్పులతో మన ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చును .





Untitled Document
Advertisements