సన్నీ అనే నేను.. ప్రామిస్ చేస్తున్నా..!

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 01:52 PM

సన్నీ అనే నేను.. ప్రామిస్ చేస్తున్నా..!

హైదరాబాద్, ఏప్రిల్ 14 : యావత్ భారత్ దేశం నివ్వెరపోయేలా.. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల అసిఫా అనే బాలికను అపహరించి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి అంతమొందించిన ఘటన తెలిసిందే. కథువా ఘటనపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమకు తోచిన రీతిలో సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి.. సన్నీలియోని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరిని కదిలించింది. తన కూతురు(దత్త పుత్రిక) నిషా కౌర్ ను ఒడిలో పెట్టుకుని దిగిన ఫోటోతో పాటు ఓ సందేశాన్ని సన్నీ ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.

"తల్లీ.. నేను నీకు ప్రామిస్‌ చేస్తున్నా. నా హృదయం, ఆత్మ, దేహం... ఇవన్నీ నిన్ను రక్షించుకునేందుకే. ఈ లోకంలో చెడు పెరిగిపోయింది. అందుకే నీకై తపిస్తూ.. నేను ఎల్లవేళలా కృషి చేస్తుంటాను. నీ రక్షణ కోసం నా ప్రాణాలైన పణంగా పెడతా. ప్రస్తుతం చిన్నారులకు సైతం రక్షణ లేకుండా పోయింది. కాబట్టి వారిని జాగ్రత్తగా సంరక్షికోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అంటూ ఓ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం సన్నీ చేసిన ఈ ట్వీట్‌కు ప్రతి ఒక్కరి నుండి సానుకూల స్పందన వస్తోంది.Untitled Document
Advertisements